బుల్లితెర మీద కావొచ్చు సిల్వర్ స్క్రీన్ మీద కావొచ్చు శేఖర్ మాస్టర్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే...అక్కడా ఇక్కడా నంబర్ వన్ కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు టాప్ స్టార్స్ కి ఫేవరేట్ కూడా. రాకేష్ మాష్టర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరిన ఆయన ఇప్పుడు టాప్ కొరియోగ్రఫర్ అయ్యాడు. ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది మాత్రం ఢీ షో. ప్రస్తుతం రిలీజ్ ఐన కొత్త మూవీస్ కి సాంగ్స్ కోరియోగ్రఫీ చేసి ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు. అలాగే ఢీ లేటెస్ట్ సీజన్ కి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మూవీస్ తో పాటుగా వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నారు. అలాంటి శేఖర్ మాస్టర్ ఇప్పుడు డాన్స్ లవర్స్ కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు.
ఆయనతో పాటు ఆయన టీమ్ మనతో కలిసి డాన్స్ చేయడమే కాదు లంచ్ కూడా చేస్తారట. మరి ఈ డబుల్ ధమాకా కావాలంటే ఏం చేయాలో కూడా చెప్పేసారు. అదేంటంటే ఇటీవల ఆయన “ఇష్టమే కాని ప్రేమ లేదంట” అనే వెబ్ సిరీస్ ని చేశారు. అది ఇంకా టెలికాస్ట్ కాలేదు. తొందరలోనే అది టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉందట. ఆ వెబ్ సిరీస్ లో ‘ బుజ్జి బుజ్జి కునా’ అనే ఒక సాంగ్ చేశారు. ఆ సాంగ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ చేశారు. త్వరలో ఆ ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారట. ఈ సాంగ్ మీదే వాళ్ళ టీమ్ ఒక రీల్ చేశారట. అలాగే మీరు కూడా అదే సాంగ్ మీద రీల్స్ చేసి ఆ వీడియోస్ ని తనకు పంపించాలంటూ శేఖర్ మాస్టర్ చెప్పారు.
అలా తనకు వచ్చిన రీల్స్ నుంచి బెస్ట్ వి ఫిల్టర్ చేసి అందులో ఫైవ్ లక్కీ విన్నర్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళతో కలిసి శేఖర్ మాస్టర్ అండ్ టీం డాన్స్ చేసి లంచ్ కూడా చేస్తామని చెప్పారు..మరి ఇంకా ఎందుకు ఆలస్యం మీకు ఇంటరెస్ట్ ఉంటే వెంటనే బెస్ట్ రీల్ చేసి శేఖర్ మాస్టర్ కి పంపేయండి..ఆయనతో కలిసి డాన్స్ చేసే ఆఫర్ ని సొంతం చేసుకోండి.